గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీల(Sports Competitions)కు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ కప్(Chief Ministers Cup) 2వ ఎడిషన్-2025 పోస్టర్(Poster)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం ఆవిష్కరించారు(Unveiled). ఈ క్రీడా పోటీలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 10 రోజుల దాక టార్చ్ ర్యాలీ(Torch Rally) కొనసాగనుంది. ఆ తర్వాత ఈ నెల 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. డిసెంబర్‌లో జరగాల్సిన ఈ క్రీడలు వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ పోటీలను నిర్వహించనుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, SATG ఎండీ సోనీబాల పాల్గొన్నారు.
Revanth Reddy | సీఎం కప్ 2వ ఎడిషన్ పోస్టర్ ఆవిష్కరణ
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

