- ఢిల్లీలో దాడులకు ఉగ్ర సంస్థల ప్రణాళికలు..
- వెల్లడించిన నిఘా వర్గాలు..
- దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడమే లక్ష్యం..
ఈ ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకొని ఢిల్లీలో దాడులకు ఉగ్ర సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడిరచాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు రిపబ్లిక్ డే రోజున దిల్లీ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో దాడులకు ప్రయత్నించవచ్చని తెలిపాయి. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు ఖలిస్థానీ, ఇతర రాడికల్ హ్యాండ్లర్లు స్థానిక గ్యాంగ్టర్లను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. హరియాణా, పంజాబ్, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఉగ్రనెట్వర్క్న్‌న్ను విస్తరిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపాయి. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన నేపథ్యంలో.. నిఘా వర్గాల హెచ్చరికలపై అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీ సహా ఇతర ప్రముఖ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.

