Wednesday, February 11, 2026
Homeవరంగల్‌Annaram | అన్నారం చెరువు తూముల పనుల ప్రారంభం

Annaram | అన్నారం చెరువు తూముల పనుల ప్రారంభం

సొంత నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే నాగరాజుకి గ్రామస్తుల కృతజ్ఞతలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఊర చెరువు(Pond)(దర్గా చెరువు) ప్రధాన తూముల మరమ్మతు పనులను శుక్రవారం ప్రారంభించారు. తూముల్లోకి పూడిక చేరడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రైతుల కోరిక మేరకు సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ ఆధ్వర్యంలో రిపేర్ వర్క్(Repair Work) చేపట్టారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే(Vardhannapet MLA) కేఆర్ నాగరాజు(KR Nagaraju) సొంత నిధులు అందించారు. మరమ్మతు పనులు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పనులకు సహకరించిన ఎమ్మెల్యే నాగరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్‌, పార్టీ నేతలు పిన్నింటి అనిల్ రావు, గొడుగు భిక్షపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ ప్రశాంత్, ఆ శాఖ సిబ్బందితోపాటు వార్డ్ మెంబర్స్ గాడిపెల్లి రాజబాబు, రాపోలు రవీందర్, దొంతమల పవన్ కళ్యాణ్, ముంజంపల్లి నాగరాజు, కొండేటి రామచందర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరగాని అఖిల్, రామచందర్, బుర్ర యాకయ్య, ఒగ్గు యాకయ్య, రంప దర్గయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News