Saturday, March 7, 2026
Homeరంగారెడ్డిRepair Work | మట్టి రోడ్డుకి మరమ్మతు పనులు

Repair Work | మట్టి రోడ్డుకి మరమ్మతు పనులు

కీసర: దమ్మాయిగూడ మునిసిపాలిటీ (Dammaiguda Municipality) పరిధిలోని కీసర (Keesara) గ్రామంలో సబ్‌రిజిస్ట్రార్(Sub Registrar) కార్యాలయానికి వెళ్లే మట్టి రోడ్డు గుంతలమయంగా మారడంతో శుక్రవారం మరమ్మతు పనులు (Repair Work) చేపట్టారు. కమిషనర్ (Commissioner) వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుపైకి వస్తున్న చెట్ల కొమ్మలను తొలగించి, రోడ్డు మీద మట్టి పోసి చదును చేశారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌వో గంగన్న, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News