Tuesday, March 3, 2026
Homeనల్లగొండVeliminedu | వెలిమినేడులో ఎర్రజెండా

Veliminedu | వెలిమినేడులో ఎర్రజెండా

చిట్యాల మండలం లో వెలిమినేడు మేజర్ గ్రామపంచాయతీ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈనెల 11వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలలో కమ్యూనిస్టుకే పట్టం కట్టిన గ్రామ ప్రజలు. సిపిఎం బలపరిచిన బొంతల చంద్రారెడ్డి గతంలో సర్పంచ్ 14 ఏళ్లు పని చేశారు. సీపీఎం పార్టీ నుండి 1981లో,1988లో, 1994 లో వరుసగా సర్పంచ్ గా గెలుపొందారు.1995 లో జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టాలని కోరాగా సర్పంచ్ పదవికి రాజీనామా చేసి జిల్లా నాయకత్వం బాధ్యతలు చేపట్టారు.

అనంతరం ఆనాడు ఉప సర్పంచ్ గా కామ్రేడ్ ఆరూరు వీరయ్య కొనసాగి గ్రామాన్ని పాలించారు. 1995లో ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఓటమిపాలైంది. 2000 లో ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి ఆరూరు వీరయ్య గెలుపొందారు. 2005 నుండి జరిగిన ఎన్నికల్లో వరుసగా సిపిఎం ఓటమితో 2025 లో డిసెంబర్ 11న జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా చంద్రారెడ్డి గెలుపొందారు. వెలిమినేడు ప్రజలు సిపిఎం పార్టీకి పూర్తి విశ్వాసంతో ఉన్నారని సర్పంచ్ గా అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News