- నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి,
- 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా
- 60 మంది రక్తదానం చేశారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీలో “నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి, 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్, అహ్మదియ్య ముస్లిం యూత్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా బాధితులను కాపాడేందుకు మెగా రక్తదాన శిభిరంను ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా రెడ్ క్రాస్ చైర్మన్:
డాక్టర్ విజయచందర్ రెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు: ఈ.వీ శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు: బిళ్ల రమణారెడ్డి విచ్చేసి ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందచేయడం జరిగినది. అనంతరం ఛైర్మన్ డాక్టర్ విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరు స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ రక్తాన్ని దానం చేసిన రక్తదాతలను అబినందించినారు. అనంతరం రక్తదాతలకు పండ్లు పంపిణి చేసినారు.

తలసేమియా పిల్లల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) గుల్లెపెల్లి శివ కుమార్ (రెడ్ క్రాస్), అహ్మదియ్య ముస్లిం యూత్ వరంగల్: ముహమ్మద్ అహ్మద్ పాషా, ఆర్గనైజర్లను రక్తదాతలను రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ పక్షమున అబినందించినారు.
ఈ రక్తదాన శిబిరం లో హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు: ఈ.వీ శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు: పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ల రమణారెడ్డి, రెడ్ క్రాస్ డాక్టర్ : డా. మహమద్ తాహర్ మసూద్, ఎన్.ఎస్.ఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగవెళ్ళి నరేందర్, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు), గుల్లెపెల్లి శివ కుమార్ (రెడ్ క్రాస్), కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ యాకుబ్ పాషా,

యూత్ అధ్యక్షులు కబీర్ పాషా, లతీఫ్ షరీఫ్, ముహమ్మద్ సలీం, అయాన్ అహ్మద్ పాషా, కోలా రాజేష్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్, అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్, ఊరటి రవికుమార్, సృజన, జ్యోతి, భావన, పల్లె రాజిరెడ్డి, బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు, ఎస్.కె ముస్తఫా, లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ (హైకోర్ట్ అడ్వకేట్), యాద రవి కుమార్, చెలిమల్ల అశోక్ కుమార్, తూనం రాము, సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్, మండల భూపాల్, మోడెం రాజశేఖర్ గౌడ్, నాగవెళ్ళి కార్తిక్, రెడ్ క్రాస్ సిబ్బంది : సునీత, స్వప్న, సతీష్ రక్తదాన శిబిరం లో 60 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ సందర్బంగా బీబీ నగర్ రక్తదాత ఆంజనేయులు 37 సార్లు రక్తదానం చేసినందుకు శాలువాతో సత్కరించారు.
