పెద్దపల్లిలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(Women Development and Child Welfare Department)లో ఔట్ సోర్సింగ్ (Outsourcing) పద్ధతిలో వివిధ డిపార్ట్‌మెంట్(Department)లలో ఖాళీల (Vacancy) భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో మొత్తం 14 రకాల ఉద్యోగాలు (Jobs) ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2, సూపరింటెండెంట్ 2, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, పారా మెడికల్ స్టాఫ్ 1, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ 1, జెండర్ స్పెషలిస్ట్ 1, కేస్ వర్కర్ 2, హోం కోఆర్డినేటర్ 1, డాక్టర్ 1, సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోం కోఆర్డినేటర్ 1, నర్స్ 1, ఏఎన్ఎం 1, అకౌంటెంట్ కమ్ క్లర్క్ 1, యోగా థెరపిస్ట్ 1 ఖాళీలు ఉన్నాయి. నెలకు వేతనం రూ.4 వేల నుంచి రూ.33,100 వరకు ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో డిసెంబర్ 5లోపు అప్లై చేసుకోవాలి.
- Advertisement -
