Tuesday, March 24, 2026
Homeబిజినెస్Japan | జపాన్ రికార్డ్ స్థాయి బడ్జెట్

Japan | జపాన్ రికార్డ్ స్థాయి బడ్జెట్

జపాన్ ప్రభుత్వం శుక్రవారం రికార్డు బడ్జెట్‌(Record Budget)ను ఆమోదించింది. ఇండియా(India)లో మాదిరిగానే ఆ దేశంలోనూ తదుపరి ఆర్థిక సంవత్సరం(Financial Year) 2026 ఏప్రిల్ నుంచే ప్రారంభమవుతుంది. ఈ మేరకు కొత్త బడ్జెట్‌ను రూపొందించి ఆమోద ముద్ర వేశారు. ద్రవ్యోల్బణం(Inflation) కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద రక్షణ వ్యయం(Defence) నుంచి పెరుగుతున్న సామాజిక భద్రతా(Social Security) ఖర్చుల వరకు ప్రతిదానికీ చెల్లింపులు చేయడానికి 122 పాయింట్ 3 ట్రిలియన్ యెన్‌లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రక్షణ వ్యయం కోసం 9 ట్రిలియన్ యెన్‌లు కేటాయించారు. చైనాతో సంబంధాలు మరింత దిగజారుతున్న నేపథ్యంలో సైన్యాన్ని అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని సనే తకైచి లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా.. షీల్డ్‌గా పేర్కొనే తీరప్రాంత రక్షణ వ్యవస్థ నిర్మాణం కోసం 100 బిలియన్ యెన్‌లను ఖర్చుచేయనున్నారు. తద్వారా డ్రోన్‌లతో విదేశీ దళాల దాడులను నిరోధించవచ్చని భావిస్తున్నారు. షీల్డ్ ఫుల్‌ఫామ్.. సింక్రొనైజ్డ్, హైబ్రిడ్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఎన్‌హ్యాన్స్‌డ్ లిట్టొరల్ డిఫెన్స్.

- Advertisement -
RELATED ARTICLES

Latest News