Wednesday, March 4, 2026
Homeస్పోర్ట్స్Ashwin | వరల్డ్ కప్ తర్వాత వన్డేల గురించి చెప్పలేను

Ashwin | వరల్డ్ కప్ తర్వాత వన్డేల గురించి చెప్పలేను

2027 ప్రపంచ కప్(World Cup) తర్వాత వన్డే అంతర్జాతీయ క్రికెట్(One Day International Cricket) భవిష్యత్తుపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్(Former Off Spinner) రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ(Kohli), రోహిత్(Rohit) పాల్గొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతోపాటు T20 లీగ్‌ల ఆధిపత్యం, టెస్ట్ క్రికెట్ నిరంతర ఆకర్షణ వల్ల 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఆదరణ క్రమంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. ‘2027 ప్రపంచ కప్ తర్వాత వన్డే భవిష్యత్తు గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. నేను దాని గురించి కొంచెం ఆందోళన చెందుతున్నాను. ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. టెస్ట్ క్రికెట్‌పై ఆడియెన్స్‌లో ఇంకా ఇంట్రస్ట్ ఉందని నేను భావిస్తున్నాను. కానీ.. నిజం చెప్పాలంటే.. వన్డే క్రికెట్‌కి అంత స్కోప్ లేదని భావిస్తున్నాను’ అని అశ్విన్ తన హిందీ యూట్యూబ్ ఛానల్ ‘ఆష్ కి బాత్’లో పేర్కొన్నాడు. దేశంలోని అత్యంత చురుకైన క్రికెట్ పండితుల్లో ఒకరిగా పరిగణించే అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News