Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Hydraa | పవన్ కళ్యాణ్‌తో రంగనాథ్ భేటీ

Hydraa | పవన్ కళ్యాణ్‌తో రంగనాథ్ భేటీ

తీవ్ర చర్చనీయాంశంగా మారిన సమావేశం
మర్యాదపూర్వకమేనా? మతలబు ఏమైనా ఉందా?
పలు అంశాలను ప్రస్తావిస్తున్న పరిశీలకులు
చంద్రబాబు, లోకేష్ లేని సమయంలో మీటింగ్
హైదరాబాద్‌లోని ఏపీ ప్రముఖుల ఆస్తులపై చర్చ జరిగిందా?
ఏపీలోనూ హైడ్రా లాంటి సంస్థను ప్రారంభిస్తారా?
ఈ మీటింగ్ ఉద్దేశాలు త్వరలో వెల్లడవుతాయని అంచనా

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (Ap Deputy CM) పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) ఎ.వి.రంగనాథ్ (Ranganath) శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి(Mangalagiri)లోని క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అయితే ఈ సమావేశం చర్చనీయాంశమైంది. పనిగట్టుకొని హైదరాబాద్ నుంచి మంగళగిరికి వెళ్లి కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని పైకి చెబుతున్నా ఈ మీటింగ్ వెనక ఏదో ఉద్దేశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనేది అంతుబట్టట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైడ్రాకి శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ పనితీరుపై ఒకవైపు ప్రశంసలు వస్తున్నా.. మరోవైపు అంతకన్నా ఎక్కువ స్థాయిలో విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు హైకోర్టు అక్షింతలు సైతం వేసింది. ఒకరకంగా చెప్పాలంటే హైడ్రా వివాదాస్పదమైందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

ఒకవేళ ఏపీలోనూ హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటుచేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోందా అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. అదే నిజమనుకుంటే సీఎం చంద్రబాబు(CM ChandraBabu), మంత్రి లోకేష్ (Minister Lokesh) విదేశీ పర్యటనలో ఉండగా ఈ భేటీ జరగటమేంటని కొందరు అనుమానం వెలిబుచ్చుతున్నారు. హైడ్రా రంగనాథ్ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వంగానే కలవాలనుకుంటే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయేవాళ్లు. ఏపీ దాక వెళ్లి మీటింగ్ అవటంలోనే మతలబు ఉందని అంటున్నారు. ఏపీలోని పలువురు ప్రముఖుల ఆస్తిపాస్తులు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఉన్నాయి. వాటిలో నిబంధనలను ఉల్లంఘించినవి ఏమైనా ఉన్నాయా? వాటి గురించి చర్చించటానికి వెళ్లారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవటానికి వెళ్లారా అంటే ఆయనే చాలా రోజులు హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి ఇక్కడే పరామర్శించి ఉంటే ఇప్పుడీ చర్చే జరిగేది కాదు. ఏదిఏమైనా పవన్ కళ్యాణ్, రంగనాథ్ భేటీ విశేషాలు త్వరలో బయటకు వస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News