Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిNomination | లోయ‌ప‌ల్లి స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా ర‌మేష్ నాయ‌క్‌

Nomination | లోయ‌ప‌ల్లి స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా ర‌మేష్ నాయ‌క్‌

  • ప్రజల ఆశీర్వాదాలతో అట్టహాసంగా నామినేష‌న్ దాఖ‌లు
  • నేటి ర్యాలీ కేవలం ఓ నామినేషన్ కార్యక్రమం కాదు…
  • ముక్త‌కంఠంతో మార్కోగిన గ్రామాలు, వార్డులు, బస్తీలు

లోయ‌ప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా ర‌మేష్ నాయ‌క్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ ర్యాలీ నిర్వ‌హించి ఎన్నిక‌ల అధికారికి నామినేష‌న్ ప్ర‌తాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోగిరెడ్డి లచ్చి రెడ్డి వచ్చి దిశా నిర్దేశం చేయడం జరిగింది. నామినేష‌న్ అనంత‌రం ర‌మేష్ నాయ‌క్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి చేపట్టిన ఈ ర్యాలీ, నాపై ఉన్న ప్రేమకు, విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. మీ ఆశీస్సులే నా బలం, మీ అభివృద్ధే నా లక్ష్యం.. గ్రామాభివృద్ధి పథంలో సదా ముందుండి.. ఎల్ల‌వేళ‌లా మీకు తోడుగా ఉంటాన‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంచాల్ మండల్ మాజీ వైస్ ఎంపీపీ దాన్నే భాషయ్య, జిల్లా నాయకులు పోలగోని కొండయ్య, పర్తి నాయక్, బిజెపి మంచాల్ మండల్ ప్రధాన కార్యదర్శి కారింగు రాజు, మాజీ బీజేవైఎం మండల అధ్యక్షులు బండి రాజు, మాజీ ఉప సర్పంచ్ కొప్పుల వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు కావలి వెంకటేష్, పొలగోని రామచంద్రం, పోలగోని జంగయ్య అదేవిధంగా సీనియర్ నాయకులు ఎల్లంకి జంగయ్య, మహేశ్వరం వెంకటాచారి, కోయడ బిక్షపతి, కోయడ నరసింహ, బొడ్డుపల్లి వెంకటేష్, బొడ్డుపల్లి నాగరాజు, శక్తి కేంద్రం ఇంచార్జ్ కలగోని శేఖర్, బూత్ అధ్యక్షులు బండి వెంకటేష్, మాధగోని సైదులు, చెరుకు శివ, బొడ్డుపల్లి ప్రకాష్, బీజేవైఎం అధ్యక్షులు దోసపాటి రాణా ప్రతాప్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News