- జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్.
- వార్డు సభ్యులు దార సురేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు.
రంజాన్ మాసం అనేది ముస్లింలకు ఎంతో పవిత్రమైదని రంగారెడ్డి జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్ పేర్కొన్నారు.నందిగామ మండల కేంద్రంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం మసీదు ఆవరణలో వార్డు సభ్యులు దార సురేష్ ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఈ విందుకు రంగారెడ్డి జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్,సర్పంచుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు జిల్లెళ్ల వెంకట్ రెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రంజాన్ మాసంలో ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారని అన్నారు. వాళ్ళు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటూ,ప్రార్థనలు చేస్తారని అన్నారు.ముఖ్యంగా ఈ మాసంలో దానధర్మాలు విరివిగా చేస్తారన్నారు. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో, ఆత్మ పరిశీలన, స్వీయ క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఈ విందులో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కొమ్ము వెంకటయ్యతో పాటు ముస్లిం సోదరులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
