భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఇల్లందు మండలం(Yellandu Mandal) రాఘబోయినగూడెం సర్పంచ్(Sarpanch)గా ఈసాల సురేష్(Eesaala Suresh) ప్రమాణ స్వీకారం(Oath Taking) చేశారు. ఉప సర్పంచ్‌గా ఈసం వీరేందర్ బాధ్యతలు చేపట్టారు. సురేష్ స్వతంత్ర అభ్యర్థి(Independent Candidate)గా భారీ మెజార్టీ(Huge Majority)తో గెలిచిన సంగతి తెలిసిందే. సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషిచేస్తానని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో సర్పంచిగా గెలిపించిన ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, వారిని అవసరంలో ఆదుకుంటానని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
