Friday, October 10, 2025
ePaper
Homeస్పోర్ట్స్PVL | ముంబై మీటియర్స్ గెలుపు జోరు

PVL | ముంబై మీటియర్స్ గెలుపు జోరు

ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL) నాలుగో ఎడిషన్‌లో ముంబై మీటియర్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుసుకుంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 3-0 తేడాతో (15-9, 15-8, 15-12) వరుస సెట్లలో డిఫెండింగ్ చాంపియన్‌ కాలికట్ హీరోస్‌పై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై కెప్టెన్ అమిత్ గులియాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

ఆట ప్రారంభంలో కాలికట్ హీరోస్ కెప్టెన్, సెట్టర్ మోహన్ ఉక్కరపాండియన్ మధ్యలోకి పాస్‌లు అందిస్తూ అటాకింగ్‌లో వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, ముంబై బ్లాకర్ అభినవ్ సలార్ గోడలా నిలిచి కాలికట్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆట మధ్యలో ఉక్కరపాండియన్ చేసిన డబుల్ టచ్ తప్పిదం ముంబైకి కీలకమైన సూపర్ పాయింట్‌ను అందించింది. దీంతో ముంబై తొలి సెట్ నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లింది.ఆ తర్వాత శుభమ్ చౌదరి తన పదునైన స్పైక్‌లతో కాలికట్ డిఫెన్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అతనికి మథియాస్  మథియాస్ లోఫ్ట్‌సెన్స్  కూడా తోడవడంతో ముంబై పాయింట్ల వేటలో దూసుకుపోయింది.

కాలికట్ తరఫున డెట్ బోస్కో తన పవర్‌‌ఫుల్ ఎటాక్స్‌తో ప్రమాదకరంగా కనిపించాడు. కానీ, కాలికట్ చేసిన అనవసర తప్పిదాలు ఆ జట్టును దెబ్బతీశాయి.  వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ముంబై ముందంజ వేసింది. మధ్యలో సంతోష్, వికాస్ మాన్ కొంత ప్రతిఘటించినా, ముంబై కెప్టెన్ అమిత్ గులియా తన వ్యూహాలతో జట్టును ప్రశాంతంగా నడిపించాడు. తమ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేసిన ముంబై  ఈ సీజన్‌లో తమ విజయ పరంపరను కొనసాగించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News