Tuesday, October 28, 2025
ePaper
HomeతెలంగాణHydra | హైడ్రా పనితీరుపై ప్రజల్లో సంతృప్తి

Hydra | హైడ్రా పనితీరుపై ప్రజల్లో సంతృప్తి

  • దశాబ్దాల సమస్యకు వెంటనే పరిష్కారం హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులే నిదర్శనం

దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో, రోజుల్లో పరిష్కారం చూపు తోందంటూ పలువురు తమ పనితీరును ప్రశంసిస్తున్నారని. హైడ్రా స్పష్టం చేసింది. కబ్జాలు జరుగుతుంటే నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడంలేదని.. నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది. సోమవారం ప్రజావాణికి 52 ఫిర్యాదులందాయని పేర్కొంది. త్వరితగతిన పరిష్కారం లభిస్తున్నందువల్లే ఫిర్యాదులు చేస్తున్నారని వివరించింది. చాలామంది బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారని.. మరి కొంతమంది తమ వివరాలు బయటపెట్ట వద్దని అధికారులకు సూచిస్తున్నారని తెలిపింది.

కూకట్పల్లిలోని హస్మత్పేట గ్రామంలో ప్రభుత్వానికి చెందాల్సిన 10 ఎకరాలు కబ్జా చేసేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని హైడ్రా స్పష్టం చేసింది. తూములు మూసేసి, అలుగులు ఎత్తు పెంచ డంతో చెరువు పై భాగంలో ఉన్న భూములు, లే ఔట్లు నీట మునగుతున్నాయని కొంతమంది కంప్లెట్ చేసినట్లు తెలిపింది. మరికొంత మంది చెరువుల్లో మట్టి పోసి ఎకరాలకొద్దీ కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఈ ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ నేరుగా పరిశీలించి సంబంధిత అధికారు లకు పరిష్కార బాధ్యతలను అప్పజెప్పారని తెలియజేసింది.

శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ గ్రామం పరిధిలోని సరసింహకుంట తూములు మూసేసి అలుగు ఎత్తు పెంచడం వల్ల ఎఫ్ఎల్ కంటే ఎక్కువ నీరు నిలిచి తమ పంట పొలాలు మునిగిపోయాయని ఆగ్రామప్రజలు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ, మండలం లోని బీరంగూడలో ఉన్న శాంబుని కుంట కబ్జాలకు గురి అవు తోందని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సాగర్ రోడ్డులో ఉన్న యశోదనగర్ కాలనీలో శివారు ఇంటి స్థలాల వారు రోడ్డును కలిపేసుకుని దారి లేకుండా చేస్తున్నారని యశోద నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

కూకట్పల్లి ప్రాంతంలో పరికి చెరువులో సుమారు 12 ఎకరాల మేర రాత్రికి రాత్రి మట్టిపోసి నింపుతు న్నారని నంబరు ప్లేటు లేని వాహనాలను వినియోగిస్తున్నారని అక్కడి నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ పెద్ద చెరువులో కూడా మట్టిపోసి.. భవన నిర్మాణాలు చేపడుతున్నారని అడ్డు కున్న తమపై దాడి చేయడమే కాకుండా.. స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు కంప్లెంట్ చేశారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం, హస్మత్పేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ఓల్డ్ బోయినపల్లి నివాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News