Wednesday, March 4, 2026
Homeనల్లగొండProtocol | సాధారణ భక్తులకు ప్రాధాన్యం

Protocol | సాధారణ భక్తులకు ప్రాధాన్యం

  • స్వామివారి దర్శనాలలో ప్రోటోకాల్ నిషేధం : ఆలయ ఈవో వెంకట్రావు
  • దేవాలయ పరిసర ప్రాంతాలలో, ప్రైవేటు ప్రకటనలు ఫ్లెక్సీలు నిషేధం
  • టెండర్లు, లీజులు పారదర్శకంగా పక్షపాతం లేకుండా నిర్వహించాలి

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు ఆలయ ఈవో వెంకట్రావు అందులో భాగంగా గురువారం ఆలయ చైర్మన్ నరసింహమూర్తితో, దేవస్థానంలో పనిచేస్తున్న అన్ని విభాగముల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యాదాద్రికి వస్తున్న భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించుటకు కీలక సూచనలను ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. ముఖ్యంగా ప్రోటోకాల్ దర్శన వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్తీకమాసంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నందున శుక్ర, శని, ఆదివారాలలో ప్రోటోకాల్ ను పూర్తిగా నిషేధించడమైనదని, కేవలం అర్హత కలిగిన ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే విఐపి దర్శనాలని తెలిపారు. లేఖలతో అర్హత కలిగిన వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలను అనుమతించబడుతాయని ఆయన అన్నారు. లేఖ లేకుండా ఎలాంటి దర్శనాలను అనుమతించకూడదని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు కూడా కఠినంగా అమలు చేయాలని అన్నారు. అలాగే శని, ఆది, సోమవారాలలో భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున సేవా సంఘాల వాలంటీర్ల సహకారం తీసుకోవాలని అన్నారు.

- Advertisement -

దేవాలయ పరిసర ప్రాంతాల్లో మరియు కొండ కింద, ప్రైవేటు ప్రకటనలు ఫ్లెక్సీలను అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. దేవాలయానికి చెందిన భూములను ఖాళీ ప్రదేశాల ఆక్రమణలను గురికాకుండా కాంపౌండ్ వాల్ ను, బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా అనధికారికంగా ఏర్పాటు చేయబడిన దుకాణాలు, స్టాళ్లు, ఇతర వినియోగాలు దేవాలయ పరిధిలో ఖాళీ ప్రదేశాల్లో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దేవాలయానికి సంబంధించిన టెండర్లను పారదర్శకంగా సమర్థవంతంగా పక్షపాతం లేకుండా చూడాలని దేవాలయం నియంత్రణలో ఉన్న అన్ని షాపుల వద్ద ధరల వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కార్తీక మాసం చివరి వారాంతంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బంది అందరూ వారి వారి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రధానంగా ఆలయంలో జరుగుతున్న సంప్రోక్షణ కార్యక్రమంలో ఇద్దరు అర్చకులను నియమించి కార్యక్రమాన్ని విస్తరించాలని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లను చేసి ప్రతి విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది భక్తులతో సేవా భావంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఏఈఓ గజవెల్లి రఘు, నవీన్, జూసెట్టి కృష్ణ, మహేష్, ఈఈ దయాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజన్ బాబు, రామారావు, సురేందర్ రెడ్డి, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News