Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Ponguleti | ప్రెస్‌ క్లబ్‌ జర్నల్‌ ఆవిష్కరణ

Ponguleti | ప్రెస్‌ క్లబ్‌ జర్నల్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, జనవరి 10 (ఆదాబ్‌ హైదరాబాద్‌): జర్నలిస్టుల(Journalists) సంక్షేమానికి సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌(Hyderabad Press Club) నూతన కమిటీ రూపొందించిన ప్రెస్‌ క్లబ్‌ జర్నల్‌‌(Press Club Journal)ను మంత్రి సచివాలయంలో శనివారం ఆవిష్కరించారు(Unveiled). తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రతి నెలా ప్రెస్‌ క్లబ్‌ జర్నల్‌ను రూపొందించడం అభినందనీయమని పొంగులేటి ప్రశంసించారు. ఈ జర్నల్‌లో జర్నలిస్టులకు సంబంధించిన సమకాలీన అంశాలు పొందుపరచడం సంతోషకరమని చెప్పారు.

ప్రెస్‌ క్లబ్‌ నూతన పాలక మండలి ఏర్పడిన ఈ మూడు నెలల వ్యవధిలో జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను రూపొందించామని ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌.విజయ్ కుమార్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్‌ వరికుప్పల మంత్రికి వివరించారు. ప్రెస్‌ క్లబ్‌ సభ్యులందరికీ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రికి చెప్పారు. జర్నలిస్టుల కోసం ప్రెస్‌ క్లబ్‌ చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రెస్‌ క్లబ్‌ జర్నల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రెస్‌ క్ల బ్‌ ఉపాధ్యక్షుడు ఎ.రాజేష్‌, అరుణ అత్తలూరి, జాయింట్‌ సెక్రెటరీ చిలుకూరి హరిప్రసాద్‌, కోశాధికారి రమేష్‌ వైట్ల, ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గ సభ్యులు శంకర్‌ శీగ, ఎన్‌ . ఉమాదేవి, రచన ముడుంబై, వనం నాగరాజు, అమిత్‌ బట్టు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News