Wednesday, April 1, 2026
Homeఆదిలాబాద్ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలి

  • గ్రామ, వార్డు సభలు ఘనంగా నిర్వహించాలి:
  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భాగంగా ఎప్రిల్ 2వ తేదీన గ్రామ సభలను నిర్వహించాలని అన్నారు. ఈ గ్రామసభలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి, వారిచే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. ఈ గ్రామ సభల్లో మహిళలు, మహిళా సంఘాలతో పాటు, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.

- Advertisement -
  • గ్రామసభలు విజయవంతంగా నిర్వహించాలి:
  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, కలెక్టరేట్ సమావేశమందిరం నుంచి పాల్గొన్నారు. విసి అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని చెప్పారు.

ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని తెలిపారు. ఈ గ్రామ సభలలో అధికారులంతా పాల్గొంటూ, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఈ గ్రామ సభల్లో భాగంగా ప్రజల ఉన్నతికి ప్రభుత్వం అమలుపరిస్తున్న, రానున్న రోజుల్లో అమలుపరిచే పథకాల వివరాలు వెల్లడించాలని చెప్పారు. అలాగే పలు పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించాలని వివరించారు. దీంతోపాటుగా ఆర్థికంగా, సామాజికంగా లబ్ధి పొందిన లబ్ధిదారులచే సభల్లో మాట్లాడించాలని తెలిపారు.

గ్రామ, వార్డు సభల్లో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. రేపు గ్రామ, వార్డు సభల నిర్వహణకు సంబంధించి, సంబంధిత అధికారులు, ప్రత్యేక అధికారులు ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ, వార్డు సభలకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఈ విసిలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News