Friday, September 12, 2025
ePaper
spot_img
Homeకెరీర్ న్యూస్నూత‌న ఏఎంవిఐల‌కు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

నూత‌న ఏఎంవిఐల‌కు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ఇంజనీర్స్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నూతనంగా నియమితులైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల కోసం ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజ‌రుకానున్నారు. ఈ మేర‌కు ఈఎస్‌సిఐ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు, ఎఫ్ఐఈ మరియు ఎఫ్‌డిపి సెల్ హెడ్ ఇంజనీర్ సాయి కిషోర్ లు ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమం 2025 జులై 14న హైదరాబాద్‌లోని ఈఎస్‌సిఐ క్యాంపస్‌లో గల సెంటెనరీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న‌ట్లు నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు. ఈ శిక్షణ కార్యక్రమం నూతన ఏఎంవిఐకు మోటార్ వాహన నిబంధనలు, భద్రత మరియు అమలు రంగంలో తాజా జ్ఞానం, నైపుణ్యాలు మరియు ఉత్తమ పద్ధతులను అందించడానికి రూపొందించబడింద‌ని తెలిపారు.. ఈ కార్యక్రమం ఈఎస్‌సిఐ యొక్క సామర్థ్య నిర్మాణం మరియు ప్రజా సేవలో వృత్తిపరమైన శ్రేష్ఠతకు నిబద్ధతను ప్రతిబింబిస్తుంద‌ని వెల్ల‌డించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News