Friday, February 27, 2026
HomeతెలంగాణPonnam Prabhakar | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Ponnam Prabhakar | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

  • పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
  • కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
  • హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • కాంగ్రెస్ గెలిస్తేనే పట్టణం అభివృద్ధి : మంత్రి పొన్నం

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా కల్పించందని అన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. హుస్నాబాద్ పట్టణం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలిస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమన్నారు. బీ.ఆర్.ఎస్బి., బిజెపిల వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. వారికి ఓటేసినా దండగేనని అన్నారు. మంత్రి వెంట సహకార సంఘం మాజీ ఛైర్మన్ బొలిశెట్టి శివయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుంటే రాయికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని పార్టీ కండువా కప్పుకోకుండా ఉన్న నూతన అభ్యర్థులకు బీఫారాలు ప్రకటించడంపై పలువురు కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేశారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బత్తిని నాగరాజు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్ రెండవ వార్డ్ అభ్యర్థిగా ప్రకటించగా అతను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News