హుస్నాబాద్ నియోజకవర్గం(Husnabad Constituency) అక్కన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre)లో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని(Free Mega Medical Camp) మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శుక్రవారం ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ(Health Department) ఆదేశాలతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో వైద్య పరీక్షలు చేయించుకున్నవారికి అవసరమైన చికిత్సను రూపాయి ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వమే చేయిస్తుందని తెలిపారు. మందులు(Medicines), కళ్ల అద్దాలు(Glasses) అందించాలని సూచించారు. మండలంలో ప్రతిఒక్కరూ ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను ఉపయోగించుకొని వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం.. 41 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
