Saturday, October 4, 2025
ePaper
HomeరాజకీయంPONNAM| అభివృద్దిపనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం

PONNAM| అభివృద్దిపనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో 70 లక్షల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు నుండి యూసుఫ్ గూడా డివిజన్ లోని శ్రీ కృష్ణ నగర్ ఎ బ్లాక్‌లోని 600ఎమ్ఎమ్ మురుగునీటి ప్రధాన లైన్‌పై దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌ల పునర్నిర్మాణం, కృష్ణ నగర్ బి మరియు సి బ్లాక్‌లో దెబ్బతిన్న 200ఎమ్ఎమ్  మురుగునీటి పైపులను భర్తీ చేయడం, మధురి హాస్పిటల్ లేన్ మరియు శాలివాహన్ నగర్ వద్ద దెబ్బతిన్న 200ఎమ్ఎమ్ డీఐఏ మురుగునీటి లైన్‌ను భర్తీ చేయడం, చర్చి లేన్ నీటి సరఫరా లైన్‌తో భర్తీ చేయడం, యెల్లారెడ్డిగూడ సెక్షన్, లక్ష్మీనరసింహ నగర్ మరియు యూసుఫ్ గూడా బస్తీ ప్రాంతాల్లో దెబ్బతిన్న పైప్ లైన్ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. యూసుఫ్ గూడాలోని 7.18 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్ఎన్ నగర్ , కమలాపూర్ కాలని, ఇంజనీర్స్ కాలని, నవోదయ కాలని,కృష్ణ నగర్ వెంకట గిరి లలో సీసీ రోడ్లు నిర్మాణం మరియు కృష్ణ నగర్, వెంకట గిరి లలో కమ్యూనిటీ హాల్ లకు శంకుస్థాపన చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..యూసుఫ్ గూడా డివిజన్‌లో పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి 7.18 కోట్ల రూపాయలు మరియు మురుగునీటి కోసం 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రజా పాలన ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకుపోతున్నామన్నారు. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడానికి కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలిపించారో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. శనివారం శంకుస్థాపన చేసుకున్న ఏడు కోట్ల రూపాయల విలువైన పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News