Tuesday, October 28, 2025
ePaper
Homeరాజకీయంకరీంనగర్‌ నుంచి రాజకీయ విమర్శలు బంద్‌

కరీంనగర్‌ నుంచి రాజకీయ విమర్శలు బంద్‌

  • అభివృద్ది గురించే మాట్లాడుతానన్న బండి

ఇప్పటినుంచి కరీంనగర్‌లో రాజకీయ విమర్శులు చేయనని అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. కరీంనగర్‌ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌ రావుతో కలిసి 14 వ డివిజన్‌ లో పలు పనులను, పద్మానగర్‌ లోని 16వ డివిజన్‌ లో నూతనంగా నిర్మించిన ’ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌కు ధీటుగా కరీంనగర్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ’ స్మార్ట్‌ సిటీ నిధులు అనేక కారణాలవల్ల పూర్తిగా వినియోగం లోకి రాలేదు. ఇప్పుడిప్పుడే అవన్నీ ఖర్చు చేసి అభివృద్ధి చేసుకుంటున్నం. కేంద్రం నుండి తప్పకుండా నిధులు తీసుకొస్త. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటాం.’ అని బండి సంజయ్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News