ప్రజల భాగస్వామ్యం..సమగ్రా దిశానిర్థేశం…
సమిష్ఠి కృషి వల్లే నేరాలు తగ్గుముఖం…నగర కోత్వాల్ సి.వి.ఆనంద్..!!
ఫోటోరైటప్…నేరాల సమీక్షా సమావేశంలో పాల్గోన్న అధికారులు..!!
పోలీసులు కేవలం శిక్షించే వ్యవస్థగా కాకుండా ప్రజల మద్దతుతో పనిచేసే విధంగా మారుతున్నారు.ఇది నేరాల తగ్గుదలకు ప్రధాన కారణం.ఇటి వల పోలీసుశాఖ చేపట్టిన పలు సాంకేతికపరమైన మార్పులు సీసీటీవీ కేమెరాల వ్యవస్థను విసృతంగా వినియోగించడం మానవ నిఘా బలగాల బలోపేతం వంటి చర్యలు కూడా నేరాల నియంత్రణలో ప్రభావం చూపాయి.వీటికి తోడు హైదరాబాద్‌నగరంలో నేరాల నియంత్రణలో పోలీసు విభాగం నిరంతరం తీసుకుంటున్న చోరవలు ఆధునిక సాంకేతిక వినియోగం మరియు సమిష్ఠి చర్యలు విశేష ఫలితాలు ఇస్తుండటంతో నేరాల ఈ స్థాయిలో గణనీయమైన తగ్గుదల నమోదువడం వెనుక ఉన్న ఫ్యూహాత్మక చర్యలే.పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్ ప్రత్యేక కథనం…
సమగ్ర దిశానిర్ధేశం…!!
నేరాల నియంత్రణలో హైదరబాద్ నగర పోలీసుశాఖ మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించింది.సాంకేతిక కమ్యూనిటి భాగస్వామ్యం మానవ నైపుణ్యల సమన్యయంతో నేరాలను అణిచివేయడంలో పోలీసులు అపూర్య విజయాన్ని సాధిస్తున్నారు.కోత్వాల్ సి.వి.ఆనంద్ నేతృత్వంలోని పోలీసు వ్యవస్థ అనుసరిస్తున్న సమగ్ర దిశానిర్ధేశం వల్లే నగరంలో శాంతి భద్రత స్థిరపడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.నగర వ్యాప్తంగా దాదాపు 10లక్షలకు పైగా సీసీటీవీ నిఘా కెమెరాల ఏర్పాటు చేసి వీటిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24గంటలు నిఘా చేస్తు ఎలాంటి అనుమానాస్పధ కథలికలైన వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.ఈ సాంకేతిక వ్యవస్థ వల విడియో సాక్షాలు అందుబాటులోకి వచ్చాయి.


…………………………………………………………………….
ప్రాపర్టికేసులు నమోదు తీరు ఇలా.2023 24…2024 నుండి2025
మర్డర్‌ఫర్ గేన్ 5కేసుల నమోదు 2024లో 3కేసులు నమోదు,రాబరి కేసులు 251నమోదు, 2025వరకు 135 నమోదు,ఇళ్లలోచోరి కేసులు 450, 2025లో 443నమోదు, దోంగతనాలు 4778 కేసు నమోదు,2025 వరకు 3501 కేసులు నమోదుచేసారు.ఒవరాల్ మొత్తం కేసులు 38,206 నమోదు కాగా, 2025లో ఆసంఖ్య 31533కు చేరుకుంది.దీంతో నేరాల నమోదు సంఖ్య తగ్గుముఖం పట్టింది.
కమ్యూనిటి పోలీసింగ్ ప్రజల భాగస్వామ్యం..!!
పోలీసులు ప్రజలతో నేరుగా మమేకమవుతు సమస్యలను వింటూ ఆవగహాన కార్యక్రమాలు చేయడం, బస్తీలో పాదయాత్ర బలగాల ప్లాగ్‌మార్చ్,మైత్రీ సంఘాలతో సమావేశాలు, సైబర్ అవగహాన సదస్సులు,వంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో భద్రత పట్ల అవగాహాన పెంచుతున్నాయి.అంతేకాకుండా మహిళల భద్రత కోసం షీ టీం, హాక్ ఐ యాప్ ద్వారా వేగవంతమైన స్పంధన అందిస్తున్నారు.వీటితోపాటుమైనర్ యువతపై దృష్టిసారిస్తు వారి కౌన్సిలింగ్ చేయడం వంటి పనులు చేయడం వల్లే నేరాల తగ్గుముఖం పట్టాయి.
సమిష్టీ కృషి వల్లే నేరాలు తగ్గుముఖం…నగర కోత్వాల్ సి.వి.ఆనంద్.ఐపీఎస్.
హైదరాబాద్‌ను సురక్షీత నగరంగా తీర్చిదిద్దే దిశగా నగర పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంధని భవిష్యత్తులో మరింత ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నేరాలను పూర్తిగా ఆరికట్టే లక్ష్యంగా కృషి చేస్తున్నామని,దీనికితోడు ప్రజల సహాకారం పోలీస్ శాఖల మధ్య సమన్వయం,మా దృష్టిలో పెట్టుకున్న లక్ష్యం నేరరహిత హైదరబాద్ అని నగర కోత్వాల్ స్పష్టంచేసారు..
