పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కీసర చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కీసరలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీఐ ఆంజనేయులు, ఎస్ఐ హరిప్రసాద్, ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమరులైన పోలీస్ సిబ్బందికి, మరియు కుటుంబ సభ్యులకు ఇదే మా వందనమంటూ.. పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ.. జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
