Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిCounseling | జవహర్ నగర్ అరుంధతి నగర్ లో పోలీస్ కౌన్సిలింగ్

Counseling | జవహర్ నగర్ అరుంధతి నగర్ లో పోలీస్ కౌన్సిలింగ్

పరిధిలోని అరుంధతి నగర్ లో సి డి ఈ డబ్ల్యూ కుషాయిగూడ జవహర్ నగర్ పోలీస్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి డి ఈ డబ్ల్యూ ఇన్స్పెక్టర్ సైదయ్యా అడ్మిన్ ఎస్ ఐ రాము విమెన్ ఎస్ ఐ మమత సిబ్బంది పాల్గొన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో పెళ్లి అనంతరం భార్యాభర్తలు పరస్పర గౌరవంతో జీవించాల్సిన విధానంపై వివరించారు. చిన్న చిన్న సమస్యల కారణంగా గొడవలకు దిగకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కారం సాధించుకోవాలని సూచించారు. గొడవల అనంతరం కేసులు పెట్టి దూరంగా ఉండడం సరైన మార్గం కాదని స్పష్టంగా అవగాహన కల్పించారు.

- Advertisement -

అదేవిధంగా అరుంధతి నగర్ ప్రాంతంలో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కిరాయికి నివసిస్తున్న వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. ఇంటి ఓనర్లు గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్లు ఇవ్వకూడదని సూచించారు. పూర్తి వివరాలు చెక్ చేసిన తర్వాతే ఇళ్లను రెంటుకు ఇవ్వాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచనలు ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News