ప్రభుత్వ ఉద్యోగి(Government Employee) విధులకు ఆటంకం(Obstruction of Duties) కలిగించినవారిపై పోలీస్ కేసు నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్(Electricity Sub Station)లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 26న ముగ్గురు వ్యక్తులు అనుమతి లేకుండా సబ్ స్టేషన్‌లోకి ప్రవేశించటమే కాకుండా ఆపరేటర్ కన్నెబోయిన యాకయ్యను అసభ్యకరంగా దూషించారు. కాంపౌండ్ వాల్ కట్టకుండా అడ్డుకొని అతని విధులకు ఆటంకం కలిగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను మండల కేంద్రానికి చెందిన మాడుగుల రాజు (మాజీ ఎంపీటీసీ), చింతపట్ల చిన్న సోమేశ్వరరావు, చింతపట్ల పెద్ద సోమేశ్వరరావుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.ప్రవీణ్ తెలిపారు.
- Advertisement -
