Thursday, February 12, 2026
Homeక్రైమ్ వార్తలుVijayawada | అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు

Vijayawada | అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు

బస్టాండ్లలో ప్రయాణికులు (Bus stand Passengers) లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా (Gang) గుట్టును పోలీసులు (Police) రట్టు చేశారు. నలుగురు నిందితులను పండిట్ నెహ్రూ బస్టాండ్ (Pandit Nehru Bus Stand) దగ్గర అరెస్ట్ చేశారు. వారి నుంచి విలువైన బంగారు ఆభరణాలను (Gold Ornaments), రూ.5.44 లక్షల నగదు(Cash)ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని మహారాష్ట్రకు చెందిన, పేరు మోసిన పార్థి గ్యాంగ్‌గా గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు.

ఈ మేరకు మొదటి కేసు ఈ నెల 24న నమోదైంది. తర్వాత రోజు కూడా రెండు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో.. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి, స్పెషల్ టీమ్‌లను ఏర్పాటుచేసి, అనుమానితుల కదలికలను గమనించారు. అరెస్టయిన వ్యక్తులు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, హైదానగర్ ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన ప్రశాంత్ రాజేంద్ర భోంస్లే(26), కవితా భగవాన్ భోంస్లే(50), మంజు పవార్ భోంస్లే(27), భవన్ ఆనంద్ భోంస్లే(25) అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News