Saturday, February 28, 2026
HomeజాతీయంPM Modi | దేశాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

PM Modi | దేశాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

  • సభా సమయాల్లో డ్రామాలు వద్దు….
  • సమస్యలపై చర్చకు ఎప్పుడూ సిద్దమే
  • ఓటమిని కూడా అంగీకరించలేని విపక్షం
  • విపక్షాలకు ప్రధాని మోడీ చురకలు
  • మొదలైన తొలిరోజు పార్లమెంట్‌ సమావేశాలు
  • విపక్షాల ఆందోళన.. వాయిదాల పర్వం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తొలి రోజునే రాజకీయ వాడి వేడి చర్చలతో మార్మోగింది. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ వ్యవహరించారు. ఈ సమావేశాల్లో ప్రపంచ కప్‌లు సాధించిన మహిళల కబడ్డీ జట్టు, క్రికెట్‌ జట్టు, అంధుల క్రికెట్‌ జట్టుకు లోక్‌సభ అభినందనలు తెలిపింది. దేశం తరపున ఆడి గెలిచినందుకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తూ.. ఈ జట్టులకు సభ పక్షాన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అభినందనలు తెలిపారు. ఈ సమావేశాల్లో ఢల్లీి ఎర్రకోట సవిరీపంలో జరిగిన పేలుడుపై, దేశ అంతర్గత భద్రతపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయం అజెండా చర్చించడానికి ఈ అంశం లేదని స్పీకర్‌ తిరస్కరించారు. వాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

పార్లమెంటు సమావేశాలనుద్దేశించి ప్రధాని మోడీ మాట్లా డుతూ..తొలిసారి పార్లమెంటు సభ్యులైన యువ పార్లమెం టుసభ్యులు చాలా విచారంగా ఉన్నారు. వారి నియోజక వర్గాలను పీడిస్తున్న సమస్యలను వ్యక్తీకరించే అవకాశం వారికి లభించడం లేదు. అన్ని పార్టీలు ఈ యువ, తొలిసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారికి అవకాశాలు కల్పిం చాలి. వారి అనుభవం దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పార్లమెంటేరియన్లు ఈ అంశాలను తీవ్రంగా పరిగణించాలని నేను కోరుతున్నాను. నాటకం చేయడానికి వారికి చాలా వేదికలు ఉన్నాయి. అలా చేయాలనుకునేవారు కొనసాగిం చవచ్చు. కానీ ఇది నాటకం కాదు. అభిప్రాయాలను పంచుకోవ డానికి ఒక వేదిక. విరీరు నినాదాలు చేయాలంటే దేశం మొత్తం చేయొచ్చు. కానీ పార్లమెంటులో విరీ దృష్టి నినాదాలపై కాదు.. విధానాలపై ఉండాలి అని అన్నారు. అలాగే రాజకీయాల్లో ప్రతికూలత ఉపయోగకరంగా ఉండవచ్చు. కానీ చివరికి దేశ నిర్మాణం కోసం కొంత సానుకూల ఆలోచన ఉండాలి. ప్రతికూలతను పరిమితిలో ఉంచుకొని, దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలని పార్లమెంటు సభ్యులను మోడీ అభ్యర్థించారు.

- Advertisement -

మొదటి రోజు వాయిదా పడిన తర్వాత..

సమావేశాల మొదటి రోజు వాయిదా పడిన తర్వాత, సోమవారం ఉదయం 12.00 గంటలకు సమావేశం మళ్లీ ప్రారంభమైంది. అయితే, విపక్ష సభ్యులు సర్‌, ఢల్లీి బాంబు పేలుళ్లు, కాలుష్యం తదితర ప్రజాసంబంధిత అంశాలపై చర్చ జరగాల్సినట్లు డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నారని, ప్రశ్నోత్తరాలకు సహకరించాలనని సూచించినప్పటికీ, విపక్ష సభ్యులు తమ ప్రతిపాదిత సమస్యలపై ముందుగా చర్చ చేయాలని పట్టు పట్టారు. దీని కారణంగా సభను మధ్యాహ్నం 12.00 గంటలకు, ఆ తర్వాత 2.00 గంటలకు వాయిదా వేశారు.ఇంకా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధను ఆధారంగా ప్రతిపక్షాలు బయటకు రాలేదు అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఆమె పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని, కేంద్రం విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ మండిపడ్డారు.

బీహార్‌ ఓటమి పై మోదీ విమర్శలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. బీహార్‌ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని కూడా అంగీకరించే మనసు విపక్షాలకు లేదని ఆయన ధ్వజమెత్తారు. ఓటమి బాధ నుంచి బయటకు వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఇదేనని ఇండియా కూటమి పార్టీలకు మోదీ సూచించారు.

విపక్షాల ప్రవర్తనపై ప్రధాని అసంతృప్తి

మోదీ మాట్లాడుతూ..సభా సమయాల్లో నినాదాలు, ఆందోళనలు, డ్రామాలు వద్దని మోదీ స్పష్టం చేశారు..,చట్టసభల్లో సమయానికి అనుగుణంగా చర్చలు జరగాలని,దేశ ప్రగతి కోసం పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు తప్పనిసరి అని మోదీ పేర్కొన్నారు.అలాగే, గత పది సంవత్సరాలుగా విపక్షాలు ఒకే తరహా అడ్డంకుల రాజకీయాలు చేస్తున్నాయని, ఇక ప్రజలు ఆ విధానాన్ని ఆమోదించడం లేదని విమర్శించారు. అవసరమైతే విపక్షాలకు కొన్ని ‘‘టిప్స్‌’’ ఇవ్వడానికి తాను సిద్ధమని మోదీ వ్యాఖ్యానించారు.

దేశాభివృద్ధి.. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

దేశాభివృద్ధి మాత్రమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధాని స్పష్టం చేశారు.వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ఈ శీతాకాల సమావేశాలు కూడా దారి చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.జీఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజల్లో సంతృప్తి పెరిగిందని, ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతున్నదని తెలిపారు.

సమావేశాలు సజావుగా సాగాలన్న కేంద్రం

ఈ నెల 19 వరకు కొనసాగే 15 రోజుల శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులు రానున్నాయన్నారు ప్రధాని మోదీ ..ఈ సమావేశాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నడవాలంటే విపక్షాలు సహకరించాలని కేంద్రం కోరింది.ఈ నేపథ్యంలో ఆదివారం నాడు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.అక్కడ విపక్షాల డిమాండ్లు విన్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల కీలక సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.వాటిలో కృష్ణా జలాల వినియోగంపై చర్చించాలని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరగా,రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News