Thursday, February 12, 2026
Homeసాహిత్యంPicnic | మనసు నిండే పండుగ

Picnic | మనసు నిండే పండుగ

పిక్నిక్ అంటే మనసు మనుషులు కలయిక. పచ్చని ప్రకృతి(Nature) ఒడిలో.. పలకరించే చల్లని గాలిలో.. కుటుంబ సభ్యులు(Family Members), స్నేహితుల (Friends) మధ్య మొదలయ్యే సంబరం. ఆకాశమే పైకప్పుగా.. నేల తల్లే పచ్చని తివాచీగా.. తీపి కబుర్లు, ఆటపాటల(Games and Songs)తో చిన్ననాటి స్మృతులను గుర్తు చేస్తుంది. పాట.. మనసులోని నొప్పి(Pain)ని తగ్గిస్తుంది. చెప్పే జోకులు(Jokes) నవ్వులను పంచుతాయి. పిక్నిక్.. వివిధ వయసుల తరాల మధ్య భావోద్వేగాలకు వారిధిగా నిలుస్తుంది.

ప్రకృతి శబ్ధాలు, గాలి, నవ్వులు, పచ్చని వాతావరణం మనసులను శుభ్రం చేస్తాయి. పిక్నిక్ అంటే మనసులో సంతోషం పొందే ఉత్సవం. సానుకూల శక్తిని అందించే థెరపీ. మనసు నిండే పండుగ. సందడి, సంబరాల హోరులో చిన్నబోయిన మనసులోని బాధలన్నీ పంచుకొని ఒత్తిడికి దూరంగా ప్రకృతి ఒడిలో గడపడం మనసుల్లో ప్రశాంతతకు పిక్నిక్‌లు వారధులుగా నిలుస్తాయి.

- Advertisement -

వంటకాలు రుచిగా చేసే అల్లరి.. సరదాగా మరుపురాని జ్ఞాపకాల మూటగా నిలిచిపోతాయి. పిక్నిక్‌లు ఒత్తిడి నుంచి మనసుకు ఉపశమనం కలిగిస్తాయి. ప్రకృతి ఒడిలో గడపడం.. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. సంబంధాల బలోపేతానికి పిక్నిక్‌లు వేదికలుగా నిలుస్తాయి. పిక్నిక్‌ వల్ల ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది. టీవీ, ఫోన్ల దూరంగా ఉరుకుల పరుగుల హైటెక్
జీవితానికి ఉపశమనం కలిగిస్తాయి.

అల్లకల్లోల జీవితానికి దూరంగా పార్కుల్లో, బీచ్‌ల్లో, జలపాతాల్లో స్వచ్ఛమైన గాలి, వెలుతురు, హాయి కొలిపే ప్రకృతి వాతావరణంలో గడపడం మనిషి ఆయుష్షును పెంచుతుంది. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఉల్లాసానికి పిక్నిక్‌లు సాధనాలు. పిక్నిక్‌లో ఆటపాటలు, నవ్వులు జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలు.

మనసును, మనుషుల మధ్య సంబంధాలను పునర్జీవింపజేసే చక్కని సాధనం పిక్నిక్. సమాజ ఐక్యత, గౌరవం, సౌహార్ద్రత, సంఘీభావం, సామాజిక సమత, మానవీయ, నైతిక విలువలకు పిక్నికులు ఆలంబనగా నిలుస్తాయి.

  • నేదునూరి కనకయ్య
- Advertisement -
RELATED ARTICLES

Latest News