మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135 వ వర్ధంతి సందర్భంగా ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ DNT,NT అడ్వకేట్స్ ఫోరం అధ్యక్షులు, సీనియర్ లాయర్ గుండ్లపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
సత్యనారాయణ గారు తన ఉద్యమోన్ముఖ ప్రసంగంలో మాట్లాడుతూ….
పూలే గారు బోధించిన సమానత్వం, స్వాభిమానం, విద్య హక్కులు — ఇవి నేటికీ అణగారిన వర్గాల పోరాటానికి దిశానిర్దేశం. వ్యవస్థలో ఇంకా కనిపిస్తున్న అసమానత, వివక్ష, సామాజిక బేధాలపై పోరాడటానికి పూలే చూపిన మార్గం మాకు శక్తిని ఇస్తోంది.
78 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ ఈ సమాజంలో ఎదుర్కొంటున్న
అన్యాయం ఇక సహించేది లేదు. పూలే తెరవెనుక నిలిచిన ధైర్యమే మా పోరాటానికి ప్రేరణ. మా ఫోరం నిర్లిప్తంగా కూర్చోకపోగా… మరింత ధైర్యంగా, మరింత దూకుడుగా ముందుకు సాగుతుంది” అని స్పష్టం చేశారు.
సామాజిక న్యాయం కోసం చేసిన ప్రతి అడుగు ప్రజల జీవితాల్లో మార్పును తేవాలి. పూలే ఆలోచనలను కార్యాచరణలోకి తీసుకురావడమే ఈ తరానికి అసలు బాధ్యత” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో MBC సంఘం అధ్యక్షులు బెజ్జం వెంకట్, BC నాయకులు వెంకటేష్ గౌడ్, సామాజిక కార్యకర్తలు పాల్గొని పూలే గారి సేవలను స్ఫూర్తిగా స్మరించారు.
