బీసీ జేఏసీ తుర్కపల్లి మండల అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్
వరంగల్ జిల్లా(Warangal District)లోని కరీమాబాద్ ఉర్సు దర్గా ఆటోస్టాండ్ దగ్గర ఉన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే (Jyotirao Phule) విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ (BC JAC) తుర్కపల్లి మండల చైర్మన్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల విగ్రహలను ధ్వంసం చేసే వారి పైన పిడి యాక్ట్ (PD Act) నమోదు చేయాలని కోరారు. వెంటనే మరో పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుండా పోలీస్ అధికారాలు కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. లేని పక్షంలో బీసీలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు
