Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణగ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

  • ఎంపికలో అర్హులకు తావేది
  • గ్రామ సభల్లో గందర గోళం
  • లబ్ధిదారుల ఎంపికలో అయోమయం
  • తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
  • అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు

గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి కోసం చేపట్టే పనులు, ప్రణాళికలతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు అన్ని చేరేలా సాక్షాత్ ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఏర్పాటు చేసుకునే సభ అలాంటి గ్రామసభలు జగదేవపూర్ మండలంలో అబాసు పాలవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, లబ్ధిదారుల ఎంపికలు, పథకాల అమలులో పారదర్శకత పాటించకపోవడంతో ప్రజల ఆగ్రహం ఆగ్రహానికి గురవుతున్నారు. వెరసి గ్రామ సభల్లో లొల్లి పుట్టి ఆవో గందరగోల సభల్లా దర్శనమిస్తున్నాయి.హస్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తో పాటు నూతన రేషన్ కార్డుల మంజూరి ప్రక్రియ తదితర ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విధితమే. అయితే అధికారులకు గ్రామ పాలనపై పరిపూర్ణమైన అవగాహన లేని కారణంగా గందరగోళం నెలకొంటుంది.

అనర్హులకు పెద్దపీట వేస్తూ లబ్ధిదారుల లిస్టు ప్రకటించడంతో వట్టిపల్లి, గొల్లపల్లి గ్రామాలలో ప్రజలు అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు కాంగ్రెస్ నేతల అతి కారణంగా మా పేర్లు పోయాయి అంటూ ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో నేతల జోక్యం ఏందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన రేషన్ కార్డుల కోసం సంవత్సరాల కాలంగా వెయిట్ చేస్తున్న కొందరికి గ్రామసభలో ఉపశమనం లభించగా అర్హులైన మరికొందరి పేర్లు రాకపోవడంతో ప్రజలు అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా మోక్షం లభిస్తుంది అనుకున్న తరుణంలో అధికారుల తీరుతో అసలుకే మోసం వచ్చిందని కనీసం రేషన్ కార్డు లేని దుస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలకు యేటా 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారుల ఎంపిక అంశంలో మండలంలో చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి.

ఉపాధి హామీ పథకం పనుల్లో 2024-25 సంవత్సరంలో కనీసం 20 రోజులపాటు పాల్గొన్న వారి పేర్లను మాత్రమే లబ్దిదారుల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యవసాయ కూలీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధి హామీ పనులకు వెళితే వచ్చే కూలీకి రెట్టింపు కూలీ ఇతర పనుల్లో లభిస్తుండడంతో తాము విధిలేని పరిస్థితుల్లో ఆ పనులకు వెళ్లామంటున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్ళని కారణంగా తమను ఆత్మీయ భరోసా లబ్ధి పొందడానికి అనర్హులుగా ఎలా పేర్కొంటారంటూ వ్యవసాయ కూలీలు అధికారులను నిలదీస్తున్నారు. భూమిలేని నిరుపేద కూలీలందరిని ఉపాధిహామీతో సంబంధం లేకుండా అర్హులుగా గుర్తించి 12వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని జగదేవ్పూర్ మండల ప్రజలు డిమాండ్‌ చేశారు. రైతు భరోసా పథకం కింద లబ్దిదారుల జాబితాలో లేని కొందరు రైతులు కూడా నిరసన వ్యక్తం చేశారు. రైతుబంధు పథకంలో తాము ప్రభుత్వ సహాయాన్ని పొందామని, ప్రస్తుతం ఆ భూమి వ్యవసాయానికి అనుగుణంగా లేదని, ఇతరత్రా కా రణాలతో తొలగించి లబ్దిపొందకుండా చేశారని తమ భూమి వ్యవసాయ యోగ్యంగానే ఉందంటూ కొందరు జాబితాలో చేర్చాలని పట్టుబట్టారు.ప్రజల ఆగ్రహాన్ని ఆద్యం పోసినట్లుగా భారత రాష్ట్ర సమితి నేతలు సైతం ప్రజలకు అండగా నిలబడటంతో గ్రామాల్లో గ్రామసభలను ప్రజలు గంటాపతంగా నిరసిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి నేతలు అరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రామసభల్లో మాత్రం ప్రజలు అధికారులకు తిట్లు శాపనార్థాలతో ముగింపు సభ పలకడం జగదేవ్పూర్ మండలంలోని అన్ని గ్రామా గ్రామాల్లో కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News