నవీన్ యాదవ్ గెలుపులో బీసీ రాజ్యాధికార సమితి పాత్ర కీలకం
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి
42 శాతం రిజర్వేషన్లకు మోకాలడ్డుతున్నది కేంద్రమేనని వ్యాఖ్య
తెలంగాణ(Telangana)లో బీసీల అభ్యున్నతి, రాజ్యాధికారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీసీ రాజ్యాధికార సమితి (BC Rajyadhikaara Samithi) అధ్యక్షుడు దాసు సురేష్(Dasu Suresh)ను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అభినందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Election)లో నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపులో బీసీ రాజ్యాధికార సమితి నాయకుల కృషి అమూల్యమైందని ప్రశంసించారు.
దాసు సురేశ్ శనివారం పీసీసీ చీఫ్‌ని ఆయన నివాసంలో కలిశారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల (Resevations) పెంపుపై నెలకొన్న సందిగ్ధత గురించి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అనేక విధాలుగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వ సహకారం అందకపోవడంపై మహేశ్ కుమార్ అసహనం ప్రదర్శించారు. పరిస్థితులను బీసీలు అర్థంచేసుకోవాలని కోరారు.
