Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan | జగన్ తో జాగ్రత్తగా ఉండాలి..

Pawan Kalyan | జగన్ తో జాగ్రత్తగా ఉండాలి..

  • చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం
  • హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది..

వై ఎస్ ఆర్ సీపీ పై ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని అన్నారు.

అనంతరం, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే అవసరమైన విషయం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు చెప్పారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు ముఖ్యమంత్రి క్లుప్తంగా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. శాసనసభలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News