విమాన సర్వీసులు(Flight Services) పెద్ద సంఖ్యలో రద్దవుతున్న(Cancell) నేపథ్యంలో ప్రయాణికులు (Passengers) రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో.. డిమాండ్‌ను తట్టుకునేందుకు అత్యవసర పరిస్థితుల దృష్టా ఇండియన్ రైల్వేస్ 37 ట్రైన్లకు అదనంగా 116 కోచ్‌లను(additional coaches) జత చేసింది. ఇవి 114 ట్రిప్‌లకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. దక్షిణ రైల్వే అత్యధికంగా కోచ్‌ల సంఖ్యను పెంచింది. చైర్ కార్, స్లీపర్ బెర్త్‌లు కలిగిన ఈ కోచ్‌లు నేటి నుంచి 18 రైళ్లలో ప్రయాణికులను తీసుకెళతాయి.
ఉత్తర రైల్వే హైడిమాండ్ ఉన్న రూట్లలో నడిచే 8 ట్రైన్లలో త్రీఏసీ, చైర్ కార్ కోచ్‌లను యాడ్ చేసింది. పశ్చిమ రైల్వే టూఏసీ, త్రీఏసీ కోచ్‌లను 4 సర్వీసుల్లో పెంచింది. తూర్పు మధ్య రైల్వే రాజేంద్రనగర్, న్యూఢిల్లీ మార్గంలో నడిచే రైలులో 5 ట్రిప్‌లకు టూఏసీ కోచ్‌లను అడిషనల్‌గా ప్రవేశపెట్టింది. ఇవి నేటి నుంచి 10వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయి. తూర్పు తీర రైల్వే భువనేశ్వర్, న్యూఢిల్లీ సర్వీసుల్లో 2ఏసీ కోచ్‌లను అదనంగా కలిపింది. తూర్పు రైల్వే 3 ట్రైన్లలో 6 ట్రిప్‌ల కోసం స్లీపర్ కోచ్‌లను ఎక్‌స్ట్రా ఎటాచ్ చేసింది. ఇవి రేపటి నుంచి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
ఈశాన్య సరిహద్దు రైల్వే త్రీఏసీ, స్లీపర్ కోచ్‌లను 2 రైళ్లలో 8 ట్రిప్‌ల కోసం అదనంగా ఏర్పాటుచేసింది. ఇవి ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు ఉంటాయి. వీటికితోడు 4 స్పెషల్ ట్రైన్ల(Special Trains)ను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల పేరు.. 1. గోరఖ్‌పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ స్పెషల్.. 2. న్యూఢిల్లీ-మార్‌టైర్ కెప్టెన్ తుషార్ మహాజన్ వందే భారత్ స్పెషల్.. 3. న్యూఢిల్లీ-ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ స్పెషనల్.. 4. హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ స్పెషల్.
