Homeరంగారెడ్డిBSP | అంబేద్కర్ ఆశయాల కోసం కృషిచేయాలి..

BSP | అంబేద్కర్ ఆశయాల కోసం కృషిచేయాలి..

డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద అంబర్ పేట్ చెక్ పోస్ట్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి గ్యార మల్లేష్. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..

Gyara Mallesh Pays Tributes to Ambedkar 1

దేశానికి దశా, దిశ చూపించిన, సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు పోరాడిన, భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆత్మ శాంతించాలంటే ఆయన ఆశయాల కోసం ఓటు వేసినప్పుడే ఆ మహానీయుడి ఆత్మ శాంతిస్తుందని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగితేనే నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుందనీ తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యంజాల ప్రహ్లాద్, నాయకులు చిత్రం కృష్ణ, గట్టు నరసింహ, మంద శివ, చిత్రం బాలరాజ్, బంటి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News