- అన్ని పార్టీల మద్దతు అభ్యర్ధుల హోరాహోరీ ప్రచారం…
- గెలుపుపై ఎవరి ధీమా వారిది…
- బ్యాట్ ‘గుర్తు’ పై ఓటువేసి అధిక మెజార్టీతో గెలిపించాలి.
- సర్పంచ్ అభ్యర్థి చీదురు శంకర్ విజ్ఞప్తి.
పర్వతగిరి మండల కేంద్రంలో వివిధ పార్టీలు బలపరిచిన, స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులు హోరా హోరిగా ఇంటింటి ప్రచారాన్ని మంగళవారం చేపట్టారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, పట్టణ అధ్యక్షుడు కూసం రామచందర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీదురు శంకర్ మాట్లాడుతూ తన తండ్రి కీర్తిశేషులు చీదురు కిష్టయ్య ప్రజల మనిషి అని, తన ఆశీస్సులతో ఆశయాలతో ప్రజాసేవకై వస్తున్నానని, ఈనెల 11న ఉదయం 7 గంటల నుండి ఒంటిగంట వరకు జరిగే స్థానిక ఎన్నికల్లో బ్యాట్ గుర్తు పై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే గ్రామంలో ఉన్న 14 మంది వా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా అధిక మెజారిటీతో గెలిపించాలని పర్వతగిరి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు తో పాటు, మండల, స్థానిక కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన అనంతరం 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ, అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయుట, గ్రామంలో ప్రతి కాలనీకి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుచుట, వీధి దీపాల వ్యవస్థలు చక్కదిద్దుతా, కరెంటు సరఫరా లేని కాలనీలకు విద్యుత్ సౌకర్యము అందేలా చూస్తానని, గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ముందు వరుసలో ఉంటానని, బేడ బుడగ జంగాల కాలనీలకు సిసి రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని, ఎస్సీ కాలనీ ప్రజలకు పోల్కమ్మ చెరువు ద్వారా ఇబ్బంది లేకుండా చూస్తానని, నల్లా కనెక్షన్ లేని ప్రతి ఇంటికి ఉచిత కనెక్షన్ ఇప్పిస్తానని, లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షం నీరు రాకుండా మరమ్మతులు చేపిస్తానని, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యసదుపాయం కల్పించుటకు కృషి చేస్తానని, అలాగే గ్రామంలో కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటానని, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీ.సీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానని పర్వతగిరి మండల కేంద్ర ఓటర్లకు అభయం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పిన్నింటి సునీల్ రావు, చింతపట్ల అజయ్ రావు, వర్థినేని కృష్ణ చైతన్య, పోకల శంకర్, కుంచాల రవి, జంగ మల్లికార్జున్, కూసం ప్రవీణ్, మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

