Sunday, March 15, 2026
Homeరంగారెడ్డిGabbilalpet | కనుమరుగైన పార్క్ స్థలం

Gabbilalpet | కనుమరుగైన పార్క్ స్థలం

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గబ్బిలాల పేట రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో ఉన్న పార్క్ స్థలం కబ్జాకు గురవుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు భూ కబ్జాదారులు పార్క్ స్థలాన్ని ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు.

స్థానికుల సమాచారం ప్రకారం గతంలో ఈ ప్రాంతంలో పేదల భాయ్ బొంద ఉండేది. తరువాత దాదాపు 400 టిప్పర్ల మట్టిని వేసి ఆ స్థలాన్ని పార్క్ కోసం అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అదే స్థలాన్ని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుండటం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది.

- Advertisement -

ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణలను తొలగించి పార్క్ స్థలాన్ని పరిరక్షించాలని, ఆ ప్రాంతానికి కంచె వేసి కాంపౌండ్ వాల్ నిర్మించి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News