Saturday, October 4, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుస్వేఛ్చ బలవన్మరణంపై పోలీసుల దర్యాప్తు

స్వేఛ్చ బలవన్మరణంపై పోలీసుల దర్యాప్తు

పూర్ణచందర్‌ రావు కారణమని తండ్రి ఫిర్యాదు

తన కూతురు స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్యకు పూర్ణచందర్‌ రావు అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి తెలిపారు. భర్తతో విడిపోయాక పూర్ణచందర్‌ రావుతో స్వేచ్ఛ ఉంటున్నారన్నారు. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విబేధాలు ఉన్నాయని, స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాట ఇచ్చి ఆమెతో సహజీవనం చేశాడని పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ అతడు వచ్చాడని, ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. తన కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పూర్ణచంద్రర్‌ రావు ఓ న్యూస్‌ చానల్‌ పని చేసేవాడని తండ్రి తెలిపారు. గతంలో పూర్ణచందర్‌ రావుతో విభేదాలు రావడంతో విడిపోతామని పలుమార్లు తన కూతురు చెప్పిందని వాపోయాడు. చిక్కడ పల్లిలో జవహర్‌ నగర్‌ లో ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానల్‌ యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌(40) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -

Latest News