కరీంనగర్: ఈ నెల 27 నుండి 29 వ తేదీ వరకు తెలంగాణ పాఠశాల క్రీడా సమాఖ్య ఆద్వర్యంలో హైదరాబాద్ జిల్లా లోని యస్ కె 8 స్పోర్ట్స్ అకాడమీ లో జరగనున్న 69వ తెలంగాణ రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల 5 వ తరగతి కి చెందిన అనిత బిష్ణోయ్ అండర్-11(బాలబాలికల) విభాగంలో,6 వ తరగతి కి చెందిన సునిత బిష్ణోయ్ అండర్-14 (బాల బాలికల) విభాగంలో ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు.
అదేవిధంగా ఇటీవల స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బాల బాలికల ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో అనిత, సునిత లు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డా|| ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, కె.హన్మంతరావు, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపికృష్ణ, సమన్వయ కర్తలు భవానీ, నిఖిత, వ్యాయామ ఉపాధ్యాయుడు సరిగొమ్ముల రాజు లు పాల్గొన్నారు.
