Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Table Tennis | రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

Table Tennis | రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

కరీంనగర్: ఈ నెల 28,29వ తేదీలలో తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆద్వర్యంలో హైదరాబాద్ జిల్లా లోని మోయినాబాద్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బాలబాలికల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలకు స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల కు చెందిన 5 గురు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు. ఈ పోటీల అండర్-13(బాలుర) విభాగంలో 6 వ తరగతి కి చెందిన సి.హెచ్.అన్విక్ష్ , అండర్-15 బాలికల విభాగంలో 7 వ తరగతి కి చెందిన వై. క్రీనా, అండర్-15 బాలుర విభాగంలో 9 వ తరగతి కి చెందిన బి. సుక్రీత్, యం. రిశబ్, అండర్-17 బాలుర విభాగంలో 10 వ తరగతి కి చెందిన పి. శశిధృవ్ ఎంపికైనట్లు తెలిపారు.

అదేవిధంగా ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన బాల బాలికల ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డా|| ఇ. ప్రసాదరావు మరియు డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, కె.హన్మంతరావు, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపికృష్ణ, సమన్వయ కర్తలు నాగరాజు, రబీంద్ర పాత్రో, రాము, భవానీ, వ్యాయామ ఉపాధ్యాయుడు సరిగొమ్ముల రాజు , సాగర్ లు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News