స్థానిక పద్మనగర్ లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవం పురస్కరించుకుని ఆర్ట్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను పారమిత విద్యాసంస్థ ల చైర్మన్ డా||ఇనుగంటి ప్రసాదరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పారమిత హెరిటేజ్ పాఠశాలలో 6 నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులచే మరియు ఉపాధ్యాయులచే చిత్రించబడిన దాదాపు 700 కి పైగా కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. ఈ కళాకృతులలో ముఖ్యంగా మహిళా సాధికారత,ప్రకృతి,పర్యావరణం మరియు వివిధ అంశాలపై వేసిన పెన్సిల్ స్కెచ్ లు, పెయింటింగ్ లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
అలాగే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పారమిత పాఠశాలల అధినేత డా|| ఇనుగంటి ప్రసాదరావు మాట్లాడుతూ మాటలతో వ్యక్త పరచలేని భావాలను ఆర్ట్ ద్వారా మాత్రమే కళాత్మకంగా వ్యక్త పరచగలమని, ఆర్ట్ ద్వారా మాత్రమే ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా ప్రస్పుటంగా వ్యక్త పరచగలమని , అలాగే బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత పాఠశాలల అధినేత డా|| ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రష్మిత , వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంత రావు , ప్రిన్సిపాల్ గోపికృష్ణ, సమన్వయ కర్తలు నాగరాజు, రాము, ఆర్ట్ టీచర్ అజింక్యా, ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
