తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పొరుగు దేశాన్ని నిందించటం పాకిస్థాన్‌కు అలవాటేనని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆఫ్గనిస్థాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వాన్ని చెలాయించటం పాకిస్థాన్‌కి కోపం తెప్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టెర్రరిస్ట్ సంస్థలకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోందని, తద్వారా వాటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని మండిపడింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపణలను తోసిపుచ్చింది. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో రెండు దేశాల బలగాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగటంపై పాకిస్థాన్ స్పందిస్తూ ఆ సమయంలో ఆఫ్గనిస్థాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారని, ఇండియా ఆదేశాలతోనే తమపై దాడులు జరిగాయని ఆరోపించింది. బోర్డర్ వెంట భారత్ డర్టీ గేమ్స్ ఆడే అవకాశాలు ఉన్నాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మనపై నోరుపారేసుకున్నారు. అవసరమైతే ఇండియా, ఆఫ్గనిస్థాన్‌లపై ఒకేసారి యుద్ధానికి సిద్ధమని ప్రగల్భాలు పలికారు.
Ind-Pak: పొరుగు దేశాన్ని నిందించటం పాకిస్థాన్‌కి అలవాటే
RELATED ARTICLES
- Advertisment -
