- పద్మారావు గౌడ్
నిరుపేదలకు వైద్య సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నామాలగుండు ప్రాంతానికి చెందిన రాచమల్ల నవీన్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో,సితఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పద్మారావు గౌడ్,రూ.2 లక్షల విలువైన వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్.ఓ.సి పత్రాన్ని సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పేదల ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో స్థానిక నేతలు,అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
