Tuesday, October 28, 2025
ePaper
Homeఅంతర్జాతీయంఇరాన్‌ అధ్యక్షుడికి మన ప్రధాని మోదీ ఫోన్

ఇరాన్‌ అధ్యక్షుడికి మన ప్రధాని మోదీ ఫోన్

ప్రధాని మోదీ ఈ రోజు (జూన్ 22 ఆదివారం) మధ్యాహ్నం ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్‌తో యుద్ధం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తీవ్రం కావడంపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్రిక్తతలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకునేందుకు రెండు దేశాలు ప్రయత్నించాలని సూచించారు. శాంతి, భద్రత, స్థిరత్వం పునరుద్ధరణకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ముందుకెళ్లాలని సూచించారు. ఇదిలాఉండగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్ట్‌గా ఇజ్రాయెల్ తరఫున అమెరికా యుద్ధంలోకి దిగింది. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీనిపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News