- ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తెస్తాం
- రెవెన్యూ శాఖ పనితీరు పెరగాల్సిందే
- రెవెన్యూలో త్వరితగతిన టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పూర్తి
- జనవరి నుంచి ఉధృతంగా స్వచ్ఛాంద్రప్రదేశ్
- చేతివృత్తులు, కులవృత్తులకు ఇతోధిక ప్రోత్సాహం
- రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సిఎం చంద్రబాబు
రెండు నెలల్లో వంద శాతం ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మ్యానిపులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తెస్తామన్నారు. డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై రెండోరోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సవిూక్షించారు. ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూశాఖ సంతృప్త స్థాయిలో సేవలు అందించట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ- ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తామన్నారు. నెక్‌స్ట్ జెన్ టెక్నాలజీ వైపు మనం ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఆర్టీజీ జిల్లా కేంద్రాలు అక్టోబర్ చివరి నాటికి సిద్ధమవుతాయని చెప్పారు. ఇకపోతే రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా..అది రాష్ట్రమంతా వర్తింపజేయాలని సూచించారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధప్రదేశ్‌ను ఉద్యమంగా చేపట్టనున్నట్లు తెలిపారు.





ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఘన వ్యర్ధాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. చేతివృత్తులు, కులవృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా పైపులైన్లు పెట్టేలా ఎస్‌ఓపీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్వచ్ఛత అంటే.. శుభ్రత ఒక్కటే కాదు, ప్రజల ఆలోచన కూడా మారాలన్నారు.
సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 తేదీ వరకు స్వచ్ఛతాహీ సేవ చేపట్టాలని తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీలు జరగాలన్నారు. ఐదు జోన్లలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్నా.. డ్రెయిన్లు సరిగ్గా లేవని మేజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.. రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులు పెద్దమొత్తంలో పరిష్కారం అవుతాయని తెలిపారు పోలీసు, రెవెన్యూ విభాగానికి వచ్చిన ఫిర్యాదులో 70 శాతం మేర ఉన్నాయని గుర్తుచేశారు. ఆర్‌ఓఆర్‌కు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో ఏపీలో రెవెన్యూ, భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.