Tuesday, March 3, 2026
Homeబిజినెస్Oil Imports | 5 నెలల గరిష్టానికి.. ఆయిల్ దిగుమతులు..

Oil Imports | 5 నెలల గరిష్టానికి.. ఆయిల్ దిగుమతులు..

రష్యా(Russia) నుంచి ఇండియా(India)కి చమురు దిగుమతులు 5 నెలల గరిష్టానికి చేరాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను కెప్లర్ (kpler) అనే సంస్థ విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.. మన దేశం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే చమురు రోజురోజుకూ పెరుగుతోంది. గత నెలలో గరిష్టంగా ఒక రోజు 1.8 బ్యారెల్స్(Barrels) ఆయిల్ దిగుమతి అయింది. ఇది 5 నెలల హయ్యస్ట్ కావటం గమనార్హం.

నవంబర్‌లో ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం క్రూడ్ మిక్స్‌(Crude Mix)లో రష్యా షిప్‌మెంట్ల వాటా 35 శాతానికి పైగా చేరింది. దేశీయంగా గిరాకీ పెరగటం, క్యూ4లో రిఫైనరీ(Refinaries)ల పనితీరు మెరుగుపడటం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుంది. అయితే.. రష్యా చమురు దిగుమతులు డిసెంబర్‌లో 1 నుంచి 1.2 మిలియన్ బీపీడీలకు తగ్గనున్నాయి. ఈ రికార్డ్ స్థాయి కనిష్టానికి అమెరికా(America) తాజాగా విధించిన ఆంక్షలే కారణం. ఈ నేపథ్యంలో ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా నుంచి ఇండియాకి ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News