వికటిస్తున్న జీవనశైలే కారణం…!!
అవసరాన్ని మించి శరీరంలోకి కేలరీలు…!!
కూర్చోని చేసే పనులతో అధిక ముప్పు…!!
నేడు ప్రపంచ ఉబకాయ దినం…!!
(ఆదాబ్ ప్రత్యేక ప్రతినిధి సయ్యద్‌హాజీ)
హైదారాబాద్ నగరంలో ఉబకాయం (Obesity) పెను ప్రమాదంగా మారుతోంది. అనారోగ్యాల ఉబిలోకి దించుతోంది. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే భాగ్యనగరంలో కూడా అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.గతంలో దేశ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాల్లో బెంగుళూర్ కోచి చెన్నై తోపాటు ఈ జాబితాలో మన నగరం చేరడం ఆందోళన కల్గించే విషయం. వేగంగా మారుతున్న జీవనశైలి కూర్చోని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమకు దూరంగా ఉండటంతో చాలామంది ఉబకాయం బారిన పడుతున్నారు.చివరికి అది పలు వ్యాధులు జబ్బులు తెచ్చిపెట్టే అతిపెద్ద రుగ్మతగా మారుతోంది. ప్రపంచ ఉబకాయ ఫేడరేషన్ నివేదిక ప్రకారం 2030నాటికి 250మిలియన్లు మంది 5నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు ఉబకాయులుగా మారు ప్రమాదం ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2.8 మిలియన్స్ మంది ప్రజలు ఉబయాకం వల్ల చనిపోతున్నారు.ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఆక్టోబర్ 26, వరల్డ్ ఒబేసిటి డే నిర్వహిస్తున్న సందర్భంగా పాఠకులకు ఆదాబ్ అందిస్తున్న పరిశీలనాత్మక ప్రత్యేక కథనం…!!
వికటిస్తున్న జీవనశైలే కారణం….!!
శారీరక బరువు మితిమీరి పెరిగిపోవడం వల్ల జీవ క్రియలన్నీ ఆస్తవ్యస్తమవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మధుమేహం(Diabetes), అధిక రక్తపోటు(High BP), అధిక కోవ్వు, వంటి సమస్యలు చుట్టుముట్టి చివరికి గుండేపోటు పక్షవాతం వంటి పెను సమస్యలకు దారి తీస్తుందంటున్నారు. నగరంలో ప్రతి 5గురిలో ఒకరికి మధుమెహా బాధితులు కాదా అందులో అధిక శాతం ఉబకాయం ఎదుర్కోంటున్న వారేనని సర్వేలు వెల్లడిస్తున్నాయి. టైప్ 2, మధుమేహం, అధిక బరువు సమస్య ఎదుర్కోంటున్నవారే ఉబకాయం వల్ల క్యాన్సర్ల (Cancer) ముప్పు అధికమని అధ్యయనాల్లో తేలింది.మోకాళ్ల త్వరగా అరిగిపోయి నడవటం కష్టంగా మారుతుంది.రకరకాల మానసిక సమస్యలు పెరుగుతాయి. హార్మోన్ వ్యవస్థలు గాడితప్పి మహిళల్లో సంతానలేమి కూడా ఏర్పడుతుంది. గత 5సంవత్సరాలనుంచి పరిశీలిస్తే నగరంలోని మహిళల్లో క్రమేపి ఈ సమస్య పెరుగుతోంది. అధిక కొవ్వు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం పాటు శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక కారణంగా డాక్టర్లు చెబుతున్నారు.
అధిక కేలరీలతో ముప్పే….!!
అవసరమైన దానికన్నా ఎక్కువ అహారం తినటం వల్ల శరీరంలో అవసరమైన కాలరీలు చేరుతాయి. తగిన శారీరక శ్రమ లేకపోతే అది క్రమేపి అధిక బరువు తర్వాత ఉబకాయంగా మారుతుంది.ఒక వ్యక్తికి రోజుకకు 2400 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా చేయని వారు రోజుకు 1100 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఫాస్ట్‌పుడ్ వల్ల ఇంతకు రెండు మూడు రెట్లు అధికంగా చేరుతున్నాయి. అన్నం తక్కువగా తీసుకోవడంపాటు బోజనంలో 400గ్రా. కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు,తృణాధాన్యాలు, ఉండేలా చూసుకోవాలి.
ఎంత బరువు మేలు….!!
ఉబకాయాన్ని శరీర ఎత్తు బరువుల నిష్పత్తిని ఎత్తును బట్టి నిర్థారిస్తారు.ఎత్తును ఎత్తుతో మీటర్లలో బీఏంఐని నిర్థారిస్తారు. ఇది 18 నుంచి 23, వరకు ఉండాలి.ఎక్కువ ఉంటే అధిక బరువుగాఉబయకాయంగా పరిగణిస్తారు. ఎంతబరువు ఉండాలో తెల్చడానికి తేలిక సూత్రం కూడాఉంది.మన ఎత్తును సెంటిమీర్లలో కోలిచి అందులోంచి 100తిసివేయాలి. ఉదా 160 సెంటిమీటర్ల ఎత్తు ఉన్నారనుకోండి అందులోంచి 100 తీసేస్తే 60 మిగులుతుంది.కదా.. అంటే మీరు 60కిలలో బరువు వరకు ఉండోచ్చు. బీఏంఐకీ కూడా ఇది దాదాపు సరిపోతుంది.అంతకన్న దాటితే ఉయకాయంలోకి జారుగున్నట్లే లెక్కా. అధిక బరువు సమస్య ఎదుర్కోంటున్న వారిలో 20 40 వయస్సులో 25శాతం 55ఏళ్ల దాటిన వారిలో 30శాతం మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇతర రోగాలు వస్తాయి….!!
ఉబకాయంతో అధిక రక్తపోటు హార్ట్‌ఆటాక్, బ్రేయిన్‌స్టోక్, మధుమెహాం కిడ్ని,వ్యాధులు ఆస్ట్రియోపోరాసిస్,స్లీప్ అప్నీయా, రోమ్ముక్యాన్స్‌ర్,ప్రోస్టేట్,క్యాన్స్‌ర్ ఒవరీస్ క్యాన్స్‌ర్,లివర్ క్యాన్సర్,గాల్‌బ్లాడర్ క్యాన్సర్ ఇతర వ్యాధులుకూడా వస్తాయి.సంతానం కలుగదు.ఆడవారిలో పీసీఓడి సమస్యలు వస్తాయి. పిల్లలో అధికరక్తపోటు బ్రీతింగ్ సమస్యలు, సైకలాజీకల్ సమస్యలు ఫ్రాక్చర్లు ఏర్పడతాయి.కాబట్టి అధిక బరువును తగ్గించుకోవాలి.
ఈ జాగ్రతలు అవసరమే….!!
రోజు కేలరీలు తక్కువగా ఉండే కాయగూరలు పండ్లు అధికంగా తీసుకోవాలి.పోట్టు తీయని ధాన్యాలు కూడా తీసుకోవాలి.రోజు400గ్రాములకు తక్కువగా కాకుండా చూసుకోవాలి. తగినంత నీళ్ల తప్పనిసరిగా తాగాలి. రోజు క్రమం తప్పకుండా కనీసం 45 నిషాల సేపు వేగంగా నడవటం.ఈతా ఏరోబిక్, సైక్లింగ్, వంటి శారీరక శ్రమచేయాలి. నేలకు ఒకసారి బరువు చూసుకోవాలి.పేండ్లి వేడుకలు హోటల్‌కు వేళ్లు సమయంలో అహారనియమాలు పాటించాలి. ఉబయకాయాన్ని తగ్గించుకోవాలంటే ప్రాథమికంగా అవసరానికి మించిన ఆహారం తీసుకోకుడదు. ఇప్పటికే మన శరీరంలో ఉన్న అధిక కేలరీలను తగ్గించేందుకు తగిన శారీరక వ్యాయమాలు చేయాలి.అన్నింటికంటే ఉబయాయానికి ప్రాథమిక దశలనే అడ్డుకట్ట వేయాలి.ఆహార వ్యాయామాలతో బరువు తగ్గకపోతే అప్పుడు డాక్టర్లును సంప్రదించాలి. బేరియాట్రీక్ లాంటి శస్త్రచికిత్సతో నియంత్రించేందుకు ఇప్పడు అధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వీటిపై మంచి రిజల్ట్ ఉంటుందని డాక్టర్లు పేర్కోంటున్నారు.
అవగాహాన అవసరం..డాక్టర్.సి.హెచ్ మధుసూదన్..సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రలాజిస్ట్, ఉస్మానియ ఆసుపత్రి…!!
అధిక బరువుతో బాధపడుతున్న వారిలో అమెరికా మొదటి స్థానం, తర్వాత స్థానాల్లో భారత్ ,చైనా ఉంటాయి. మన దేశంలో 40మిలియన్లపైనే ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి 5 గురు స్త్రీలు పురుషుల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు.దీనిపై చిన్నతనం నుంచే పిల్లలో అవగాహాన కల్పించాలి.శారీరక శ్రమలేని ఉద్యోగాలు ప్రధాన కారణాలు,స్థూలకాయం వల్ల గుండే జబ్బులు హైబిపి,మధుమేహాంతోపాటు కేన్సర్ ఉపిరితిత్తుల సమస్య పిత్తాశయం కిడ్నిలో రాళ్లు అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.కిలో బరువు పెరిగితే గుండేపై అదనంగా 30కి.మి దూరంవరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. బీఏంఐ ప్రకారం ఉబకాయంతో బాధపడేవారు వారిలో బరువులో కనీసం 30. 40 కిలలో బరువు తగ్గడం అవసరం.దీనికి ఆధునిక చికిత్స అందుబాటులోఉంది.ఉయకాయం సమస ఉన్న వారికి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ, బెరియాట్రీక్ సర్జికి చికిత్స ద్వారా బరువు తగ్గించవచ్చు.

శారీరక శ్రమ తగ్గుతుంది..డాక్టర్ ప్రతిభా లక్ష్మీ ,ఫ్రోఫెసర్ జనరల్ మెడిసిన్…..!!
వేగంగా పెరుగుతున్న నగరీకరణ జీవనశైలిలో మార్పులు అధికంగా వ్యక్తిగత వాహానాలతో చాలమందిలో కనీసం శారీరక శ్రమ ఉండటం లేదు,అడుగు తిసి అడుగు వేయాలన్నా… వాహానాలనే వినియోగిస్తున్నారు. కొందరిలో జన్యుపరంగా కూఆ ఉబయకాం వస్తుంది.హైదరాబాద్ లాంటి నగరంలో పురుషులతో పోల్చితే స్త్రీలల్లో ఈ సమస్య పెరుగుతుంది.సాఫ్టవేర్‌కంపేనిలో పనిచేసేవారు ఇళ్లలో అహారం తయారుచేయడం మానేసారు.ఫోన్ ద్వారా పిజ్జలు,బర్గర్లు, తెప్పించి తినేస్తున్నారు.విటివల్ల అధిక కేలరీలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.రోజు 30నిమిషాలు శారీరక వ్యాయామం. జీవనశైలిలో భాగంగా చేసుకోవడం అనే అనారోగ్యాలను నివారించగలదు.

