Homeఎన్‌.ఆర్‌.ఐAKV | ‘సంక్రాంతికి వస్తున్నాము’. ఇది సినిమా కాదు..

AKV | ‘సంక్రాంతికి వస్తున్నాము’. ఇది సినిమా కాదు..

ఖతార్(Qatar) దేశంలోని ఆంధ్ర కళా వేదిక(Andhra Kala Vedika-AKV) ‘సంక్రాంతికి వస్తున్నాము’(Sankranthiki Vastunnam) అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. అల్‌వక్రా అనే ప్రాంతంలోని ఒక స్కూల్లో ఈ ప్రోగ్రామ్‌ జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కనిపించే హరిదాసు వేషధారణ, కోడిపుంజు పోటీలు, గాలిపటం ఎగరేయటం, పాలు పొంగించటం వంటివి చేశారు. ఏకేవీ సభ్యులు పంచకట్టు, మెడలో కండువాలతో సంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. దాదాపు 80 ఆర్టిస్టులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. పాటలు, డ్యాన్సులతో మస్త్ ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏకేవీ సభ్యులందరికీ ఖతార్‌లోని ఇండియన్ అంబాసిడర్(Ambassador of India) విపుల్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఏకేవీ అధ్యక్షుడిగా రమణయ్య వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News